Wednesday, September 18, 2013




















||కస్తూరి వాహకుడు ||
---------------------
నిద్రపట్టని సమయం , కుండపోతగా కురుస్తున్న వర్షం , చల్ల గాలులతో పాటు వేడిని కడుక్కుంటూ వాతావరణం, అందుకే కాబోలు ఆ చల్లదనం కూడా ఒంటికి హాయినివ్వని స్థితి. ఆ సమయంలో తీసుకున్నాను చదవడానికి "విషాద మోహనం " మళ్ళీ , మళ్ళీ , మళ్లొసారి చదువుతున్నా అంతే కొత్త అర్ధాలతో మాట్లాడుతున్న కవిత్వ పుస్తకం . కొప్పర్తి వెంకట రమణ మూర్తి గారి పై చెరిగిపోని అభిమానాన్ని పెంచిన పుస్తకం . ఒక్కో కవిత ఒక్కో పరిమళం , అలా చదువు
తూ ఒక కవిత దగ్గర ఆగిపోయా " కస్తూరి వాహకుడు " అంటూ కొప్పర్తి గారు బి.వి.వి. ప్రసాద్ గారి గురించి రాసుకున్న కవిత. ఆశ్చర్యం ఆనందం రెండూ వేసాయి. ఆ మధ్య ఎవరో మాట్లాడుతుంటే విన్నా కవులకు , సాహిత్యకారులకు ప్రపంచంలో ఎవరికీ లేనంత అసూయ తోటివాడి మీద అని. అదే సమయంలో బి.వి .వి ప్రసాద్ గారి కవితలను గురించి మరో సారి ఆలోచించి హైకూలతో పాటు ఆయన రచనల్లో ఎంత తాత్వికత ఉందొ గమనించి, గ్రహించినప్పుడు ఏదో తృప్తి. అప్పుడనిపించింది ఎన్ని రాతలు రాస్తేనేం వ్యక్తిత్వం పరిమళ భరితమైనప్పుడు కవిత్వం ఎప్పుడూ , ఎలాంటి మనసునైనా ఆ పరిమళంతో ఉత్తేజ పరుస్తూ ఉంటుందని. ఎంత గొప్ప రచనలైనా హృదయ శుద్ధి లేనిదే రాస్తే అవి టేక్నికల్లీ రచనే అయినా హృదయాన్ని స్పృశించదని.
"విషాద మోహనం " 41 పేజి లో కొప్పర్తి గారు బి వి వి గారి గురించి రాసుకున్న నాలుగు మాటలు
కస్తూరి వాహకుడు
---------------------
అతడు
అప్పుడప్పుడు వచ్చేవాడు
సంశయంగా కవిత్వం వినిపించేవాడు
తర్వాత , తరుచూ వచ్చి
చొరవగా కవిత్వం వెదజల్లెవాడు
ఇప్పుడు రోజూ వస్తాడు
తన కవిత్వాన్ని అలవాటు చేసాడు

వొక్కో రోజూ
ఎప్పటిలానే వచ్చి వెళతాడు
అయితే ఆ రోజూ
కవిత్వం కనిపించలేదని మనకు తెలియదు
------------------ వార్తా - సృష్టి - 24- 10-1998 లో


No comments:

Post a Comment