Saturday, September 28, 2013


ఒక తాత్వికత నిండిన కవిత ఎంతగా మనల్ని మౌనం లోకి తీసుకు వెళ్తుంది కదా ..!! అదే జరిగింది నేను ఈ కవిత చదివినప్పుడు. అంతర్జాలంలో ఒక వ్యాసం చదువుతూ, మరి దేనికోసమో శోదిస్తున్నప్పుడు బొల్లోజు బాబా గారి బ్లాగు సాహితీ యానం లోని ఒక అనువాద కవిత కనబడింది. నాకు చాలా నచ్చింది. దానికి శీర్షిక లేదు. అలాంటి కవితలు ఇంకా ఎక్కడ దొరకోచ్చో అని ఆ కవిత మూలం ఎవరో అని వెతికితే "Tao Te Ching " అని ఉంది. ఇది కవి పేరేమో అనుకున్నాను. ఇది కవి పేరు కాదు. "Tao Te Ching " అనే అతి పురాతన చైనా తాత్విక గ్రంధానిది. దీన్ని" Laozi " అనే తాత్విక వేత్త రాసినది. ఇది 604 BC లేదా ఆ మధ్య ప్రాంతంలో లో ఆయన రాసుంటాడు . దీన్ని Frank J. MacHovec అనే ఆయన 1962 లో అనువదించాడు.

మొదట ఆంగ్ల అనువాదం చూద్దాం . అది ఇలా ఉంది
----------------------------------------------
Clay is molded into a vessel
but the ultimate use of the vessel depends upon the part where nothing exists.

Doors and windows are cut out of the walls of a house
but the ultimate use of the house depends upon the parts where nothing exists.

So, there is advantage in using what can be seen, what exists.
And there is also advantage in using what cannot be seen, what is non-existent.

దీన్ని బొల్లోజు బాబాగారు ఇలా తెనుగీకరించారు
------------------------------------------------
మట్టి ముద్దను పాత్రగా మలచు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.

గుమ్మాలు, కిటికీలతో
గృహాన్ని నిర్మించు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.

దేన్నో పొందుతూ ఉంటాం కానీ
దాని శూన్యతనే వాడుకుంటూ ఉంటాం.

-----------------------

బొల్లోజు బాబా గారు :


Wednesday, September 18, 2013
||కస్తూరి వాహకుడు ||
---------------------
నిద్రపట్టని సమయం , కుండపోతగా కురుస్తున్న వర్షం , చల్ల గాలులతో పాటు వేడిని కడుక్కుంటూ వాతావరణం, అందుకే కాబోలు ఆ చల్లదనం కూడా ఒంటికి హాయినివ్వని స్థితి. ఆ సమయంలో తీసుకున్నాను చదవడానికి "విషాద మోహనం " మళ్ళీ , మళ్ళీ , మళ్లొసారి చదువుతున్నా అంతే కొత్త అర్ధాలతో మాట్లాడుతున్న కవిత్వ పుస్తకం . కొప్పర్తి వెంకట రమణ మూర్తి గారి పై చెరిగిపోని అభిమానాన్ని పెంచిన పుస్తకం . ఒక్కో కవిత ఒక్కో పరిమళం , అలా చదువు
తూ ఒక కవిత దగ్గర ఆగిపోయా " కస్తూరి వాహకుడు " అంటూ కొప్పర్తి గారు బి.వి.వి. ప్రసాద్ గారి గురించి రాసుకున్న కవిత. ఆశ్చర్యం ఆనందం రెండూ వేసాయి. ఆ మధ్య ఎవరో మాట్లాడుతుంటే విన్నా కవులకు , సాహిత్యకారులకు ప్రపంచంలో ఎవరికీ లేనంత అసూయ తోటివాడి మీద అని. అదే సమయంలో బి.వి .వి ప్రసాద్ గారి కవితలను గురించి మరో సారి ఆలోచించి హైకూలతో పాటు ఆయన రచనల్లో ఎంత తాత్వికత ఉందొ గమనించి, గ్రహించినప్పుడు ఏదో తృప్తి. అప్పుడనిపించింది ఎన్ని రాతలు రాస్తేనేం వ్యక్తిత్వం పరిమళ భరితమైనప్పుడు కవిత్వం ఎప్పుడూ , ఎలాంటి మనసునైనా ఆ పరిమళంతో ఉత్తేజ పరుస్తూ ఉంటుందని. ఎంత గొప్ప రచనలైనా హృదయ శుద్ధి లేనిదే రాస్తే అవి టేక్నికల్లీ రచనే అయినా హృదయాన్ని స్పృశించదని.
"విషాద మోహనం " 41 పేజి లో కొప్పర్తి గారు బి వి వి గారి గురించి రాసుకున్న నాలుగు మాటలు
కస్తూరి వాహకుడు
---------------------
అతడు
అప్పుడప్పుడు వచ్చేవాడు
సంశయంగా కవిత్వం వినిపించేవాడు
తర్వాత , తరుచూ వచ్చి
చొరవగా కవిత్వం వెదజల్లెవాడు
ఇప్పుడు రోజూ వస్తాడు
తన కవిత్వాన్ని అలవాటు చేసాడు

వొక్కో రోజూ
ఎప్పటిలానే వచ్చి వెళతాడు
అయితే ఆ రోజూ
కవిత్వం కనిపించలేదని మనకు తెలియదు
------------------ వార్తా - సృష్టి - 24- 10-1998 లోఎవరు గొంతెత్తినా 
నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికే
నిశ్శబ్దాన్ని ఎవరు బద్దలు కొట్టినా
కొత్త శబ్దాన్ని ఆవిష్కరించడానికే
కొత్త శతాబ్దాన్ని నిర్మించడానికే

మీరు మీ ప్రపంచాన్ని తూర్పారబట్టి
ఏడు వింతల్ని గుర్తిస్తారు
నేను మీ వింతల్ని జల్లెడపట్టి
నా ప్రపంచాన్ని గుర్తిసాను
(నేను నా వింతలమారి ప్రపంచమూ ..)


కొన్ని రోజుల్ని గుర్తుంచుకోడానికి కాలెండరు పై తేదిని చుట్టు చుడుతాం. లేదంటే డైరీలోనో,పుస్తకంలోనో ఆ పేజిని మడత బెడతాం లేదంటే మరో చిన్న రంగు కాగితం ఓ మూలలో అంటిస్తాం. చదువుతున్న పుస్తకంలో నచ్చిన లైన్లు కనిపిస్తే రంగు పెన్సిల్తోనో లేక స్కెచ్ తోనో మార్క్ చేసుకుంటాం. 


అలాగే ఈ రోజును కూడా కొన్ని ముఖ్యమైన మాటలుదొరికిన పేజిలాగే గుర్తు చేసుకుంటూ నా మస్తిష్కం ఈ రొజును ఇక్కడికి మార్క్ చేసుకుంది. " అలా జీవితంలో కష్టపడి ఎదిగే వాల్లంటే నాకెంతో ఇష్టం" అని తోటివారిని అమూలాగ్రం తెలుసుకుని మంచి ఆత్మీయులు కాగల వ్యక్తిని కలుసుకోవడం సంతోషంగా వుంది. "ఆకాశవాణి స్టూడియోలో ఇప్పుడు సమయం " అన్నా -"ఆకాశవాణి వాతావరణ సమాచారం" అంటూనే రేడియో తరంగాలతో వెనక్కి తీసుకెల్లిన స్వరం. ఆసక్తి, పట్టుదలతో అనుకున్నది సాదించడం మొదలుపెట్టడానికి చేసిన కృషిని పంచుకుంటూనే ఉత్సాహాన్ని నింపిన మాటలతో , నవ్వుతూనే సాహిత్య ప్రపంచంలోని కొన్ని విషయాలను నవ్విస్తూ పంచుకొని , ఒక మంచి పరిచయం జీవితంలో కొన్ని క్షణాలను ప్రభావితం చేసి స్పూర్థి ఇందనం నింపుకోడానికి కొందర్ని దేవుడు అలా మన జీవితాల్లోకి అనుమతిస్తారనుకుంటా. ఇవ్వాల్టి ఈ పేజిని గుర్తుంచుకునేట్టు చేసిన వారు "పైడి శ్రీ"గా పత్రికల ద్వారా పరిచయమై 'తెరేష్ బాబు 'గా ఆకాశవాణి ద్వార సాహిత్యలోకం గుర్తించే వారు.

ఇవాల్టి రోజున పైడి తెరేష్ బాబు సర్ ని కలవడం. ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం. స్వయంగా సంతకం చేసి బహూకరించిన పుస్తకాలను అందుకోవడం ఆనందంగా ఉంది.                  

_____________________________________________________


22 జూలై 2013 న ఆకాశవాని కేంద్రంలో తెరేష్ బాబు పైడి గారిని కలిసినప్పుడు
________________________________________________________
తెరేష్ బాబు గారు తన పుస్తకాలను స్వయంగా సంతకం చేసి ఇచ్చినవి
-----------------------------------------------------------------------