Wednesday, September 18, 2013


ఎవరు గొంతెత్తినా 
నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికే
నిశ్శబ్దాన్ని ఎవరు బద్దలు కొట్టినా
కొత్త శబ్దాన్ని ఆవిష్కరించడానికే
కొత్త శతాబ్దాన్ని నిర్మించడానికే

మీరు మీ ప్రపంచాన్ని తూర్పారబట్టి
ఏడు వింతల్ని గుర్తిస్తారు
నేను మీ వింతల్ని జల్లెడపట్టి
నా ప్రపంచాన్ని గుర్తిసాను
(నేను నా వింతలమారి ప్రపంచమూ ..)


కొన్ని రోజుల్ని గుర్తుంచుకోడానికి కాలెండరు పై తేదిని చుట్టు చుడుతాం. లేదంటే డైరీలోనో,పుస్తకంలోనో ఆ పేజిని మడత బెడతాం లేదంటే మరో చిన్న రంగు కాగితం ఓ మూలలో అంటిస్తాం. చదువుతున్న పుస్తకంలో నచ్చిన లైన్లు కనిపిస్తే రంగు పెన్సిల్తోనో లేక స్కెచ్ తోనో మార్క్ చేసుకుంటాం. 


అలాగే ఈ రోజును కూడా కొన్ని ముఖ్యమైన మాటలుదొరికిన పేజిలాగే గుర్తు చేసుకుంటూ నా మస్తిష్కం ఈ రొజును ఇక్కడికి మార్క్ చేసుకుంది. " అలా జీవితంలో కష్టపడి ఎదిగే వాల్లంటే నాకెంతో ఇష్టం" అని తోటివారిని అమూలాగ్రం తెలుసుకుని మంచి ఆత్మీయులు కాగల వ్యక్తిని కలుసుకోవడం సంతోషంగా వుంది. "ఆకాశవాణి స్టూడియోలో ఇప్పుడు సమయం " అన్నా -"ఆకాశవాణి వాతావరణ సమాచారం" అంటూనే రేడియో తరంగాలతో వెనక్కి తీసుకెల్లిన స్వరం. ఆసక్తి, పట్టుదలతో అనుకున్నది సాదించడం మొదలుపెట్టడానికి చేసిన కృషిని పంచుకుంటూనే ఉత్సాహాన్ని నింపిన మాటలతో , నవ్వుతూనే సాహిత్య ప్రపంచంలోని కొన్ని విషయాలను నవ్విస్తూ పంచుకొని , ఒక మంచి పరిచయం జీవితంలో కొన్ని క్షణాలను ప్రభావితం చేసి స్పూర్థి ఇందనం నింపుకోడానికి కొందర్ని దేవుడు అలా మన జీవితాల్లోకి అనుమతిస్తారనుకుంటా. ఇవ్వాల్టి ఈ పేజిని గుర్తుంచుకునేట్టు చేసిన వారు "పైడి శ్రీ"గా పత్రికల ద్వారా పరిచయమై 'తెరేష్ బాబు 'గా ఆకాశవాణి ద్వార సాహిత్యలోకం గుర్తించే వారు.

ఇవాల్టి రోజున పైడి తెరేష్ బాబు సర్ ని కలవడం. ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం. స్వయంగా సంతకం చేసి బహూకరించిన పుస్తకాలను అందుకోవడం ఆనందంగా ఉంది.                  

_____________________________________________________


22 జూలై 2013 న ఆకాశవాని కేంద్రంలో తెరేష్ బాబు పైడి గారిని కలిసినప్పుడు
________________________________________________________
తెరేష్ బాబు గారు తన పుస్తకాలను స్వయంగా సంతకం చేసి ఇచ్చినవి
-----------------------------------------------------------------------











No comments:

Post a Comment